లాక్ డౌన్ ప్రకటన తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మాస్క్ వినియోగాన్ని సామజిక బాధ్యతగా ప్రజలు భావించక పోవటమే ఈ పరిస్థితికి కారణం అంటోంది ఒక అధ్యయనం. కరోనా వైరస్ నుంచి రక్షణలు శానిటైజర్లు. సామజిక దూరం తో పాటు మాస్క్ ధరించటం అత్యంత అవసరం. హాంకాంగ్ లాంటి చిన్న దేశం ఈ మాస్క్ లు ధరించటంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
అక్కడ 99 శాతం మంది ప్రజల ఫిబ్రవరి  ప్రారంభం నుంచే మాస్క్ లు ధరిస్తున్నారు ఇంటి దగ్గర తయారు చేసుకున్న మాస్క్ లు కూడా వైరస్ సోకకుండా కాపాడతాయి. అదొక సామజిక అలవాటుగా మారినప్పుడే కరోనా ని కట్టడి చేయగలం అంటున్నారు అధ్యయనకారులు. తప్పని సరిగా మాస్క్ ధరించాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరిస్తే కరోనా రోగి నుంచి వైరస్ నలుగురి నుంచి ఒక్కరికి మాత్రమే సోకే అవకాశం 75 శాతం ఉండదని పరిశోధకులు చెపుతున్నారు.

ReplyForward

Leave a comment