ప్రత్యేక వేడుకల కోసం ప్రత్యేకమైన డిజైన్స్ ఆలోచిస్తూ వుంటారు. డిజైనర్లు ఇప్పుడు అన్ని వేడుకలకు ప్రత్యేకంగా పట్టు జాకెట్లపైన దేవతల బొమ్మలు డిజైన్ చేసారు. ముఖేష్ అంబానీ భార్య నీతూ అంబానీ డిజైన్ చేయించుకుని 40 లక్షల ఖరీదైన చీర జాకెట్టు పైన రవివర్మ గీసిన కృష్ణుడి బొమ్మ డిజైన్ చేసి ఇచ్చారట డిజైనర్లు. నోములు వ్రతాలు లాంటి ప్రత్యేక ఫంక్షన్లు ఇంకా పెళ్లి కూతురి డ్రెస్ ల్లోనూ ఇప్పుడు ఈ దేవతా మార్పుల బొమ్మలు కొత్త ఫ్యాషన్. ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ ఎంబోజింగ్ విధానాల్లో పువ్వులు ఆకులు జాకెట్ల పైన చిత్రించినట్లే రాధాకృష్ణలు లక్ష్మి సరస్వతి వేంకటేశ్వరుడు మొదలైన దేవుళ్లను రంగుల దారాలు  కుందన్లు పూసలు రాళ్లు  అక్కడక్కడ పెయింటింగ్ కలిపి చక్కని జాకెట్లు తయారవుతాయి. పట్టు తరహా వస్త్రంలో హైనెక్ జాకెట్టు కుట్టి దానిపైన ఈ దేవుళ్ల  డిజైన్లు వేస్తున్నారు. ఈసారి ఇంట్లో ఏదైనా ప్రత్యేక మైన ఫంక్షన్ల వస్తే వీటిలో గురించి చూడండి.

Leave a comment