స్త్రీ పురుష సమానత్వం గురించి బయట ఎంత మాట్లాడిన వాస్తవం లో భారతదేశంలో సాధించవలసింది ఎంతో ఉంది. కోవిడ్ సమయంలో ఉద్యోగ ఉపాధి అంశంలో ఎక్కువ నష్టం మహిళలకే జరిగింది. ఇప్పుడు సమానత్వ సూచి లో భారత్ ఇంకా కిందికే దిగి జారింది గత ఏడాది కన్నా 28 స్థానాలు దిగువన ఉంది భారత రాజకీయ ఆర్థిక కార్య కలాపాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నారన్నది ప్రపంచ ఆర్థిక నివేదిక మాట. మంత్రి వర్గాల్లో ప్రజా ప్రతినిధుల తో మహిళలు తగ్గరు. కార్మిక శక్తి తో వృత్తి నైపుణ్య సాంకేతిక రంగాల్లో మహిళా శక్తి తగ్గుతోంది అయితే విద్య పరమైన అంశాల్లో మాత్రం భారత్ మెరుగ్గా ఉంది అయితే ఇంత చదువుకొని ఎందుకు వెనక బడుతున్నారు ప్రభుత్వాలు ఆలోచించాలి.

Leave a comment