Categories
కార్తీకమాసం నడుస్తుంది. కార్తీకమాసంలో శివాలయ ప్రాంగణంలో,వైష్ణవాలయాల్లో ద్వజస్థంబం దగ్గర ధీపారాధన చేయడం వల్ల ఆరోగ్యం,మనశాంతి కలుగుతుంది.ఇళ్ళలో తులసి కోట దగ్గర సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తే సర్వ సంపదలు,సిరులు కలుగుతాయంటారు. కార్తీక దీపం వెళిగించటం అంటేనే అదృష్టలక్ష్మీని ఆహ్వానించటం. చిన్న దీపమ చిరు కాంతులు వెదజల్లుతు అగ్ని దేవుడు అంశంగా ఉంటూ అజ్ఞానందకారాన్ని పారద్రోలి వివేకవంతమైన రూపం ఇవ్వడంలో దీపాన్ని ఆరాధిస్తారు.కార్తీక మాసంలో వెండితో ప్రమిద బంగారంతో వత్తి చేయించి ఆవు నేయ్యి పోసి దీపధానం చేస్తారు. ధీపం భగవంతుడి రూపం కార్తీక మాసంలో సహస్రలింగార్చన సమయంలో వెలిగించే దీపం సర్వపాపహరణం.