50, 60 ఏళ్ల వయసున్న వారు ఆరు గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే డెమన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకు డెమన్షియా కు ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం పై పరిశోధనలు చేస్తున్న లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన పరిశోధకులు ఎనిమిది వేల మందిపై ఈ పరిశోధనలు జరిపారు అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ అన్న జర్నల్ లో ప్రచురించారు ఏడు గంటలు నిద్ర పోతున్న వారితో పోల్చితే ఆరు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయే వారిలో డెమెన్షియా రిస్క్ 30 శాతం ఎక్కువ అని ఈ పరిశోధన తేల్చింది. శారీరకంగా, మానసికంగా యాక్టివ్ గా ఉండటం, పోషకాహారం తీసుకోవటం  వ్యాయామం చేయటం క్రమం తప్పకుండా చేయమని సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

Leave a comment