డెనిమ్ వస్త్ర శ్రేణి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ లో భాగంగానే వస్తుంది. ఒకపుడు నలుపు, నీలం రంగుల్లో వుండే డెనిమ్ ఇప్పుడు అనేక రంగులతో, ఎంబ్రాయిడరీ  ప్రింట్ల తో ఎన్నో వెరైటీ డ్రెస్సులతో వస్తున్నాయి. ఈ డెనిమ్ జీన్స్ పైకి లాంగ్ టాప్ లు, కుర్తీలు, ట్యాంక్ టాప్ లు జాకెట్లు, అనార్కలీలు, ఏవి వేసుకున్నా ఫ్యాషనే . డెనిమ్ గౌన్లు ఎంచుకుంటే కలంకారీ జాకెట్లు మాచింగ్ గా ఉంటాయి. లెగ్గింగ్, జగ్గింగ్ ఏది వేసుకున్నా డెనిమ్ షర్టే చక్కని అమరిక. ఎంబ్రాయిడరీ డెనిమ్లతో పాటు ప్రింటెడ్ కుడా అనేక చక్కని రంగుల్లో వస్తున్నాయి. ఏ సందర్భానీకైనా, పార్టీ కయినా లాంగ్ టూర్ లు అయినా డెనిమ్ లు బెస్ట్ ఎంపిక.

Leave a comment