పుట్టింది మధ్యతరగతి కుటుంబం అందుకే అక్కడ ఎదురయ్యే కష్టాలు నష్టాలు నాకు బాగా తెలుసు అంటారు నీతా అంబానీ ముంబైకు చెందిన నీతా అంబానీ కామర్స్ చదివారు. 2010 లో భర్త ముఖేష్ అంబానీ తో కలసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ సమాచారం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ప్రకృతి విపత్తుల్లో సహాయ సహకారాలు వంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు నిర్మించారు. కోవిడ్ సమయంలో ప్రపంచ దాన కర్ణుడి జాబితాలో 2020 లో దేశం నుంచి ఒక్క నీతా అంబానీ నే ఉన్నారు. ఆ సమయంలో వలస కూలీలకు పేదలకు వృద్ధులకు ‘అన్నసేవ’ పేరుతో ఆహారాన్ని అందించారు.

Leave a comment