డిజైనర్ మాస్క్ లు

పెళ్లి కూతురు డ్రెస్ లో అద్భుతంగా తయారు చేసే ఫ్యాషన్ డిజైనర్ షున్‌సింగ్‌ రగోయ్‌ కరోనా సమయంలో కొత్తరకం మాస్క్ లు తయారు చేసింది. ఆమె భర్త పాంగ్‌చన్‌ రగోయ్‌ కో డిజైనర్ గా పనిచేస్తాడు.ఎంబ్రాయిడరీ ద్వారా మాస్క్ పైన అందమైన డిజైన్ లు సృష్టించడం మొదలు పెట్టారు మణిపూర్‌ ఎత్నిక్‌ డిజైన్స్, పక్షులు, పూలు మాస్క్‌ల పైన ప్రత్యక్షం అయ్యాయి, షున్‌సింగ్‌ రగోయ్‌ మాస్క్ లు కొద్దిరోజుల్లోనే పాపులర్ అయ్యాయి ఫేస్ బుక్ లో yanvai అని కొడితే వివరాలు కనిపిస్తాయి. ఈ అందమైన డిజైనర్ మాస్క్ లు ఒక్కటి ఐదు వందల రూపాయలు చేస్తాయి.