దేవాంగీ దలాల్ ప్రముఖ ఆడియాలజిస్ట్. పుట్టిన ఊరు ముంబాయ్. పుట్టిన పిల్లల్లో వినికిడి సమస్య గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను ‘జోష్‌ ఫౌండేషన్‌’ (జువనైల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌) అన్న సంస్థ ఏర్పాటు చేశారు ప్రపంచ బ్యాంక్ తో కలిసి పని చేస్తున్నా ‘కొయలేషన్‌ గ్లోబల్‌ హియరింగ్‌ హెల్త్‌’లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆడియాలజిస్ట్‌ ఆమె.2012లో ‘అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆడియాలజీ’ నుంచి హ్యుమానిటేరియన్‌ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు మన దేశానికి చెందిన వ్యక్తికి రావటం అదే తొలిసారి  ‘స్ర్పెడింగ్‌ పాజిటివిటీ’ పేరిట ఒక పుస్తకం రాశారు.

Leave a comment