ఒకటో తరగతి చదివే  దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్‌కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి కోసమే ననీ కరోనా తో ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి ఆయుదంగా అవ్వాలని తనకు చాతనైన మాటలతో చెప్పి చక్కగా పాడేది.దేవాంకిత కు తోడుగా వాళ్ళమ్మ పరోమా బెనర్జీ,వాళ్ళ నాన్న కూడా తోడుగా వెళ్ళారు. పాట పూర్తియ్యేసరికి విరాళాలు వచ్చి పడేవి. అలా వారం రొజులు పాటు పాడితే 70 వేలువచ్చాయి వెంటనే వాటిని కరోనా రిలీఫ్ ఫండ్ కి పంపేసింది. ఈ చిన్నారి పాప తాను కిడ్డీ బ్యాంక్ లో దాచుకొన్న పదివేలు కూడా రిలీఫ్ ఫండ్ కే ఇచ్చేసింది దేవాంకిత ను అభినందనలతో ముంచేశారు అందరు.

Leave a comment