నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?

నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రసిద్ద కవిత. ఆకులో ఆకునై,పూవులో పూవునై అంటూ కవిత్వంలో పరవశించిన కృష్ణ శాస్త్రి గారు భావ కవిత్వాన్ని ప్రచారం చేశారు . భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సినిమాలకు ప్రణయ విరహగీతాలను రాశారు. మల్లీశ్వరి పాటలు ఇప్పటికీ సంగీతసాహిత్యాలను ఇష్టపడే వారినోట వినబడుతూనే ఉంటాయి. ఆయన రాసిన కృష్ణపక్షము నుంచి…
‘కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)’

Leave a comment