నీహారికా,

ఒక క్రైం రిపోర్ట్ ప్రకారం ఏటా ఇండియాలో జరుగుతున్న ఆకృత్యాలు 1,35,000. అయితే ఇందులో దాదాపు 80శాతం చదువుకొనే వాళ్ళే. సగటున ప్రతి గంటకో విద్యార్ధి ఆత్మహత్య నమోదవుతుంది. ఎలాంటి కారణాలు, ప్రేమ విఫలం,ఇంట్లో చదువు గురించి మందలిచటం, అప్పులు, ఉద్యగం రాకపోవటం వీటి తోనే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆడపిల్ల అనే కారణంతో పురిటిలోనే పిల్లను చిదిమేస్తుంది. సామాజిక కారణాలతో కూడా ఆడ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమిళ నాడులో ఒక అమ్మాయి స్కూల్కు వచ్చాక నెలసరి వస్తే ఆమె యూనిఫామ్ పాడు చేసుకుందని టీచర్ తిట్టింది. అవమానంతో ఆ అమ్మాయి ప్రాణం తీసుకుంది. ఇంకో అమ్మాయి మెడికల్ ఎంట్రాన్స్ లో సీట్ రాలేదని ప్రాణం తీసుకోండి. ఇలా ఎక్కడో చోట ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆపెదేట్ల ప్రాణం విలువని మనుషులకు చేరవేసే పాటశాలలు ఎక్కడున్నాయి. ఇప్పుడిక తల్లిదండ్రులు సమస్య మనది కాదులే అని ఊరుకోకుండా ఎవరి పిల్లలకు వాళ్ళు ఈ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎంత కష్టమొచ్చినా మేమున్నామనే నమ్మకం ఇవ్వాలి. ఆ నమ్మకం దొరికితే చాలు  చిన్న పిల్లలు ఇలాంటి ఆత్మహత్యలకు నిస్సాహయంగా పాల్పడరు.

Leave a comment