ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన కొరియన్ సినిమా ది టెర్రర్ లైవ్ కు ధమాకా సినిమా రీమేక్. సినిమా మొత్తం ఒక న్యూస్ రూమ్ లో జరుగుతుంది అర్జున్ పాథక్ ఒక ఛానల్ లో టాప్ యాంకర్ వృత్తి పరంగా చేసిన చిన్న పొరపాటు తో అతన్ని ఛానల్ యాజమాన్యం అతన్ని ప్రాధాన్యం లేని రేడియో జాకీ గా డిమోట్ చేస్తుంది. ఒకరోజు ఒక షో లో ఒక వ్యక్తి తనను రఘువీర్ గా పరిచయం చేసుకుని సీ లింక్ పై ప్రేలుళ్లతో విధ్వంసం సృష్టిస్తా నంటాడు ముందుగా అర్జున్ నమ్మడు కానీ ఎదురుగా కనపడే కిటికీలోంచి తొలి బ్లాస్టింగ్ జరుగుతుంది. ఇలాంటి విధ్వంసాన్ని తన సొంత లాభం కోసం వాడుకుని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఛానల్ రేటింగ్ కోసం తాపత్రయ పడే యాజమాన్యం తో డీల్ కుదుర్చుకుంటాడు అర్జున్ . ఫలితంగా అతని పాత ఉద్యోగం అతనికి తిరిగి వస్తుంది కానీ రఘువీర్ విషయంలో అతను చేసిన పొరపాటు అతని జీవితాన్ని ఏ దారికి తీసుకుపోయిందీ సినిమా కథ. చాలా బాగుంది నెట్ ఫ్లిక్స్ లో ఉంది తప్పనిసరిగా చూడొచ్చు.

Leave a comment