గంటల కొద్దీ విశ్రాంతి లేని పని, టార్గెట్స్, నిరంతరం ఆఫీస్ ప్రయాణాలు అంతులేని ఒత్తిడి ఇచ్చే ఉద్యోగాలు, విపరీతమైన సంపాదన ఎన్ని ఉన్న ఈ పరుగులో విశ్రాంతి నిద్ర దూరమైతే అప్పుడే అవసరం అవుతాయి ధ్యాన, విశ్రాంతి కేంద్రాలు. మైండ్ ఫుల్ నెస్ టీచర్ లాస్ ఏంజెల్స్ కు చెందిన జరిమే హంటర్ స్ఫూర్తి తో జపాన్ రాజధాని టోక్యో లో మెడిటేషన్ కేంద్రాన్ని రూపొందించారు ఈ ధ్యాన మందిరం అంత తెలుపే. మెరిసే తెల్లని వర్ణం తో ఉన్న ఈ గదిలో ధ్యానం చేస్తే మనకు తెలియకుండానే స్వాంతన పొందుతుంది అంటారు అక్కడి నిపుణులు. ఇవాళ ప్రపంచంలో ప్రతి చోటు ఇలాంటి మందిరాల అవసరం పెరిగిపోతోంది.

Leave a comment