హైద్రాబాద్ కే ప్రత్యేకమైన ఉర్దూ జానపద గీతాలకు మళ్ళి ప్రాణం పోసింది హఫీజా అపా… గతంలో ఇంట్లో ఏ శుభ కార్యం జరిగిన డోలక్ కే గీత్ తోనే ప్రారంభం కావాలనుకొనేవాళ్ళు. ఈ దక్కనీ సంగీతం ఇప్పుడు కనుమరుగై పోయింది. హైద్రాబాద్ లోని యాకుత్ పురా లో పుట్టి పెరిగింది హఫీజా. చిన్నప్పటి నుంచి డోలక్ కే గీత్ నేర్చుకొంది. ఎంతో కాలం కుటుంబ బాధ్యతలలో డోలక్ ను అవతల పెట్టిన హఫీజా పెద్దయ్యాక,తనకు తోడుగా ఇద్దరు ముగ్గురు మహిళలను చేర్చుకొని ముగ్గురూ బృందంగా డోలక్ కే గీత్ ను పాపులర్ చేసింది. ఇప్పుడీ ఉర్దూ జానపద గీతాలు హైద్రాబాద్ లో జరిగే ఫంక్షన్ లకే కాదు సినిమా ఆడియో ఫంక్షన్ లలో విదేశాల్లో కూడా వినబడుతున్నాయి. హఫీజా అరవై ఏళ్ల కిందట పాటలతో పాటు,ఉన్న సందర్భాన్ని అప్పటికప్పుడు ఆశువుగా పాటలతో కలిపి పడుతూ వాటిని మరింత పాపులర్ చేస్తోంది.

Leave a comment