మధ్యప్రదేశ్ ప్రభుత్వం,ది ఉమెన్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ఆధ్వర్యంలో ‘దీదీ వెహికల్ సర్వీస్’ పేరుతో ప్రత్యేక వాహనం సేవలను ప్రారంభించింది.లాక్ డౌన్ సమయం లో గ్రామీణ గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణీలు కోసం అత్యవసర చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. జాహాబువా జిల్లాలోని దాదాపు 30 గ్రామాల్లో ఉండే మహిళలకు ఈ దీదీ వాహనాలు సేవలందిస్తున్నాయి.ఈ వాహనాలను ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫోన్ లో దీదీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఈ వాహన సేవలు అందుబాటు లోకి వస్తాయి.స్మార్ట్ ఫోన్ లేకపోతే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేసిన ఈ వాహనాలు తక్షణం అక్కడకు చేరుకొని సురక్షిత ప్రసవానికి  కావలిసిన ఏర్పాటు చేస్తారు.

Leave a comment