Categories
WhatsApp

డైట్ కూల్ డ్రింకుల వల్ల నష్టమే.

సన్నగా వుండేందుకు నాజుకుగా వుండే శరీర లావణ్యం కోసం చేసే డైటింగ్ పద్దతుల్లో డైట్ కూల్ డ్రింక్ తాగడం ఒక్కటి. కానీ ఇటీవల పరిసోధనల్లో ఈ కూల్ డ్రింక్ వల్ల కలిగే అనరోగ్యాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. అస్సలు మాములుగా వేసవిలో దేహ శాంతి కోసం ఎదో ఒక కూల్ డ్రింక్ కోసం చేయి చాస్తారు. అందు బాటు ధర, రుచి తియ్యదనం తదితర అంశాలు ఎక్కువగా ఆకర్షిస్తూ వుండటం తో వీటిని తాగ కుండా ఉండలేక పోతాయి. అస్సలీ కూల్ డ్రింక్ తో ఊబకాయం, చక్కర వ్యాధి ముప్పు ఎక్కువగా ఉంటాయని గతంలోనే ఎన్నో పరిశోధనాంశాలు చెప్పాయి. ఇక వాటి కంటే ఈ డైట్ కూల్ డ్రింక్ వల్ల కూడా వచ్చే అనారొగ్యాల్లో , మెదడు కుచుంచుకు పోవడం, నిర్వధ్యమవటం జ్ఞాపక శక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. ఇన్ని సమస్యలున్నందున, చల్లదనానికి, రుచికి లొంగ కుండా ఎంత దహమైనా బయట దొరికే కూల్ డ్రింక్ల జోలికి మాత్రం పోకుండా ఇంట్లో తయ్యారు చేసిన జ్యూస్ లే ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

Leave a comment