ఫోర్బ్స్ మనదేశంలో 100 మంది డిజిటల్ స్టార్స్ ను గుర్తించింది సోషల్ మీడియా వేదికగా మార్పు కోసం కృషి చేసే వాళ్ళలో లక్ష్మీ అగర్వాల్ ఒకరు. పదిహేనేళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురైంది లక్ష్మి. శారీరకంగా మానసికంగా దెబ్బతిన్న లక్ష్మీ పోరాడి దోషులను జైలుకు పంపింది. యాసిడ్ అటాక్ లపై కొత్త చట్టాలు తెచ్చేందుకు కృషి చేసింది. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంది. ఈ జీవిత కథ ఆధారంగా తీసిన ‘చపాక్’ లో దీపికా పదుకొనే నటించడమే కాక సహ నిర్మాతగా పనిచేసింది. లక్ష్మీ టెడెక్స్  స్పీకర్ కూడా. అందానికి నిర్వచనాన్ని మారుస్తూ ఎన్నో సంస్థ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది లక్ష్మీ అగర్వాల్.

Leave a comment