కొందరి గురించి చదువుతుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏదీ లేదనిపిస్తుంది.భర్తతో విడిపోయి, ఉద్యోగం లేక, ఒక చిన్న పాపతో ఎన్నో కష్టాల్లో ఉన్నా జె.జె రౌలింగ్ మొట్ట మొదట ఒక పిల్లవాడు మంత్రగాళ్ళ స్కూల్లో చేరడం గురించి ఒక నవల రాస్తే దాన్ని 12 ప్రచురణ సంస్థలు తిప్పి కొట్టాయి. ఈ పిల్లల కథలు ఎందుకు కానీ ఏదైనా ఉద్యోగం చేసుకోమని ఒక సంపాదకుడు సలహా కూడా ఇచ్చాడు.ఈ రోజున ఆమె రాసిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ల కన్నా ఎక్కువ కాపీలు అమ్ముడయ్యాయి.యునైటెడ్ కింగ్డమ్ లో ఎక్కువ పుస్తకాలు అమ్ముతున్న రచయితగా 560 మిలియన్ పౌండ్ల ధనాన్ని సంపాదించుకుంది. ఇంగ్లాండ్ లో అత్యంత ధనవంతుల్లో 12 వ స్థానాన్ని దక్కించుకుంది దీని వెనక ఆమె ఆసక్తి పట్టుదల, దీక్ష ఉన్నాయి. ఏ విజయం అయినా ఊరికే కోరుకుంటే వచ్చి పడదు కృషితోనే ఏదైనా సాధ్యమే.

చేబ్రోలు శ్యామ సుందర్
9849524134

Leave a comment