రాత్రి వేళ నిద్రించే సమయంలో మెడ వెనుక ఉండే కండరాలు వత్తిడికి గురికాకుండా సౌకర్య వంతంగా ఉండే తలగడను ఎంచుకోవాలి. మంచి దిండు ఎన్నుకునే మూలసూత్రం మన నుదురు గడ్డం మనం పడుకుని వున్నప్పుడు ఒక స్ధాయి లో ఉండాలి. అలాగే పరుపు కూడా మరీ గట్టిగా మరీ మెత్తగా ఉండకూడదు. దృఢంగా ఉండాలి. మరీ మెత్తగా అయితే లోపలికి కురుకుపోయినట్లు అసౌకర్యంగా ఉంటుంది. పరుపు ఉండలుగా వున్న వాటిలోని స్ప్రింగ్ స్పర్శ తెలుస్తుంటే వెంటనే మార్చేయాలి. నడుం చుట్టు భాగం కంటే తుంటి భాగం వెడల్పుగా ఉంటే కొంచం మెత్తగా వున్న పరుపు శ్రేష్ఠం. ఎందుకంటే పొత్తికడుపు భాగాన్న పరుపు భరించాలి. వెన్నుముక్క తన సహజ స్ధితి లో ఉండాలి. నడుము తుంటి ఒకే నరాల రేఖ లో ఉండే పరుపు ఎంత గట్టిగా ఉంటే అంత మంచిది.

Leave a comment