తలస్నానం కూడా ఒక పద్దతి ప్రకారం చేయాలట. ముందుగా బ్రష్ లేదా దువ్వేనతో జుట్టుపై నుంచి కిందికి సాఫీగా దువ్వాలి. పైనుంచి కింద వరకు బ్రష్ వెళ్ళేలాగా దువ్వాలి. అప్పుడు తలకు నూనె పట్టించాలి .జుట్టు చివర్లకు కాస్త ఎక్కువగా రాయాలి. లావెండర్ లేదా ఆల్మండ్ ఆయిల్ మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ జుట్టుకు బలం ఇస్తాయి. వెంట్రుకల తత్వానికి సరైన షాంపును ఎంచుకోవాలి. సల్ఫేట్ లేని షాంపూ వాడాలి. తలస్నానం చేశాక తలకు టవల్ చుట్టాలి. తడి ,తేమ పీల్చుకొనే దాకా అలా వదిలేయాలి.తడి తలను దువ్వేనతో దువ్వకూడదు.ఇలాంటి తలస్నానం వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment