ఇంట్లో అయినా బయట అయినా భోజనం చేసే సమయంలో సరైన పద్ధతిలో పాటించాలి. ఈ పద్ధతులు వ్యక్తిత్వానికి విశిష్టత ఇస్తాయి.  భోజన సమయంలో శబ్దలు చేయటం అసభ్యంగా ఉంటుంది. అలాంటి అలవాటును ప్రయత్నించి మార్చుకోవాలి. నోటి నిండా ఆహారం ఉంచుకుని మాట్లాడటం తినేవారికి ఎదురుగా ఉన్న వారికీ ఇబ్బందే. గబగబా తినేయడం పక్కన ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోకపోవటం సభ్యత కాదు. భోజనం టేబుల్ వద్ద సంభాషణలు తేలిగ్గా మృదువుగా ఉండాలితప్ప చర్చలు అనాలోచిత వ్యాఖ్యానాలు వద్దు. దగ్గు తుమ్ము వస్తే తప్పనిసరిగా నాప్ కిన్ అడ్డం పెట్టుకోవాలి బిల్లు చెల్లించే దగ్గర మొండిగా వ్యవహరించడం నేనే కట్టాలని వాదనలు వద్దు అవసరాన్ని బట్టి పట్టువిడుపులు ఉండాలి.

Leave a comment