దీపావళి పండుగ కధ వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. లోక కంటకుడైన నరకుడు తన పుత్రుడైనా వాడిని వెనకేసుకు రాకుండా లోకాల్ని నాశనం చేయనీయకుండా స్వయంగా కన్న తల్లే అతన్ని సంహరించింది. నరకుడి మరణానికి కడుపు తరుక్కుపోయేలా దుఃఖపడింది. పిల్లలకి విదేశీ కధలు కాకుండా ఇలాంటి ధర్మాలను గురించిన కధలు వినిపించాలి. జిజియాబాయి  ఆలా చెప్పింది కనుకే శివాజీ ధర్మ నిష్ఠ కలవాడయ్యాడు. పిలల్లకు పండుగ వంకతో వాళ్ళు నీతిని గ్రహించే విషయాలు చెప్పాలి. దీపావళి జరుపుకుంటున్న ప్రతి ఇంటా  పిల్లలకు ఈ కధ చెప్పండి. ప్రపంచం మొత్తం జరుపుకునే ఈ దీపాల పండగ అందరికీ శుభాకాంక్షలు.

Leave a comment