ఆపదలో చిక్కుకున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు గాను రూపొందించిన దిశ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది దిశ యాప్ మొబైల్ ఫోన్ లో ఉంటే చాలు ఆకతాయిల వేధింపులు, అసభ్య ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు గృహహింస ఇలా అన్ని రకాల వేధింపులను అడ్డుకుంటూ మహిళా భద్రతకు భరోసా ఇస్తోంది. ఆ యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కినా, గట్టిగా అటు ఇటు ఊపిన కొద్ది క్షణాల్లో పోలీసులకు సమాచారం వెళుతోంది. ఇప్పటికే 85 లక్షల మందికి పైగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని పోలీస్ శాఖ చెబుతోంది.

Leave a comment