నీహారికా,

ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందులోంచి బయట పడలేక పోతున్నాను అన్నావు. నిజమే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అనారోగ్యం, అవమానం వుంటూనే వుంటాయి. అంతమాత్రాన అదే తలుచుకొంటూ కూర్చుంటే సాగుతుందా? ఎంత ఉన్నత స్థాయికి చెందిన మహిళల్లో అయినా వృత్తిగత, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఇది సహజం. కష్టం వెంట సుఖం వుంటుంది, కన్నీటి పక్కన సంతోషం వుంటుంది. వాటంతట అవి రావు. మనమే సంతోషం కోసం వెతుక్కుంటూ పోవాలి. మెదడు కంటే హృదయం చెప్పే మాటలనే ఎక్కువగా వినాలి. ఎందుకంటే మెదడు లెక్కలేస్తుంది. కానీ మనసు స్పందిస్తుంది. మనకు కనిపించిన వాళ్ళంతా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని వాళ్ళకేం దిగుళ్ళు, విచారాలు లేవనుకోవడం పొరపాటు. వాటిని అధిగమిస్తూ మంచి కోసం నిరంతర పోరాటం చేస్తుండాలి. చెడు అనుభవాలను మంచి జ్ఞాపకాలతో పూడ్చేయాలి. సంతోషపూరిత క్షణాలనే మళ్ళీ మళ్ళీ సృష్టించుకొంటూ ఉంటె ప్రతికూనతల ఆనవాళ్ళు లేకుండా పోతాయి. ఒకవేళ ఉన్నా పెద్దగా నొప్పించవు. పాత సమస్యలను అధిగమించేందుకు కొత్త పరిష్కారాలు అన్వేషించాలి. నదీప్రవాహం కొండ అద్దం వచ్చిందని ఆగిపోదు. దిశ మార్చి నెమ్మదిగా పక్కనుంచి సాగిపోతుంది. అలాగే మనం కుడా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నెమ్మదిగా ముందుకు సాగాలి అదే జీవితo!

Leave a comment