ఎంత ఖరీదైన చీరకైనా బ్లౌజే బావుంటేనే అందం. అసలు సాదా చీరలకు డిజైనర్ బ్లౌజులే ఇవ్వాల్టి ఫ్యాషన్ కూడా ఎబౌఎల్బో అంటే మోచేతులపై వరకు బ్లౌజు చేతులు కుట్టించుకోవడం అవ్వాల్టి సావిత్రి దగ్గర నుంచి ఇవ్వాల్టి వరకు వచ్చిన ఫ్యాషన్. ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుంది. సాంప్రదాయ వస్త్ర శైలికి ఇది చక్కగా నప్పుతుంది. పెల్లి వేడుకలకు పట్టు చీరలపైకి ఇలాంటి బ్లౌజు కుట్టించుకోవడం కొత్త అందాన్ని తెచ్చి పెడుతుంది. అది సాదాగా కాకుండా మగ్గాం వర్క్ జోడించి, పట్టు చీరకుండే పెద్ద అంచును కుట్టించుకోన్నా ఫ్యాషనే. అలాగే అనార్కలిలూ, గౌన్లకు ఇలా మోచేతులవరకు వచ్చేలా కుట్టిన్చుకొన్నా బావుంటుంది. బెనారస్, కంచి, ఇకత్ వంటి స్టిఫ్డ్ ఫ్యాబ్రిక్ ను ఎంచుకొంటేనే బ్లౌజ్ అందం తెలుస్తుంది. ఇది ఎవరికైనా సూట్ అయ్యే ఫ్యాషన్.

Leave a comment