బైజూస్ లెర్నింగ్ యాప్ కీ కో ఫౌండర్ దివ్య గోకుల్ నాథ్.బోధన కు చెందిన సృజనాత్మకతను జోడించి డిజిటల్ హంగులతో ప్రతి ఇంట్లో తరగతులు ఉండి తీరేలా చేసిన ఘనత ఆమెది. బెంగళూరులో పుట్టిన దివ్య అమెరికా వెళ్లాలనుకుంది.జే ఆర్ ఇ రాసేందుకు బైజూస్ రవీంద్రన్ క్లాసులకు హాజరు  అయింది అక్కడే పాఠాలు చెప్పేందుకు ఒప్పుకుంది.చివరికి బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్ నే పెళ్లాడింది.ఆ లర్నింగ్ యాప్ కి సిలబస్ హెడ్ ఎన్నో కొత్త ప్రయోగాలు చేసింది. జూకెర్ తో సహా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి.ఇండియాలోని టాప్ 100 ధనిక కుటుంబాల్లో దివ్య గోకుల్ నాథ్ కుటుంబం కూడా ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేట్ కంపెనీ డైరెక్టర్ ఆమె.

Leave a comment