Categories
Gagana

దివ్యంగుల హక్కుల కోసం పోరాడే విరాళి మోది.

పద్నాలుగు సంవత్సరాల వయస్సులో విరాళి మోది మలేరియా జ్వరం తగిలింది. అనారోగ్యం ఏమిటో తెలియని కాంప్లికేషన్స్ వచ్చాయి. కోమా లోకి వెళ్ళింది. కోమా లోనుంచి కళ్ళు తెరిచేసరికి శరీరం సగం చచ్చుబదడిపోయింది. నడుం కింద భాగం పనిచేయదు. అలా వీల్ చెయిర్ కు అతుక్కు పోయిన అమ్మాయి 2014 లో మిస్ ఇండియా వీల్ చెయిర్ రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడో మోడల్ ఉత్తర భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన విద్యా సంస్థల్లో ప్రసంగించే వ్యక్తి. ఆన్లో ప్రశాదోత్సవాల వేదికో కాదా లో సుమారు లక్షమంది పాఠకులున్నరచయిత్రి. దివ్యాంగుల కోసం ప్రేత్యేక పర్యటనలు ఏర్పాటు చేసే ఎనేబుల్ ట్రావెల్స్ లో కీలక పాత్రధారి. ఈ మధ్య రైళ్ళల్లో దివ్యాంగుల వసతుల కోసం చేంజ్ ఆర్గ్ లో పిటిషన్ వేసి తిరువనంతపురం. కొచ్చిన్, చెన్నాయ్, సేమ్బాల్ పూర్లో దివ్యంగుల కోసం ప్రేత్యేక వీల్ చైయిర్లు తాత్కాలిక ర్యాంప్లు ఏర్పాటు చేయించింది. సగం శరీరం పనిచేయని విరాళి మోది సాధించిన విజయాల్లో ఇవి కొన్నే.

Leave a comment