కిక్ స్టార్ట్ క్యాబ్ సేవల్ని ప్రారంభించారు విద్యా రామ శుభన్. ఈ క్యాబ్స్ వైకల్యం ఉన్నవాళ్లు నడవ లేని వాళ్ళ కోసం పని చేస్తాయి. వైకల్యం ఉన్నవాళ్లు వాహనాల్లోకి తమంతట తాము ఎక్కలేరు. అందుకే చక్రాల కుర్చీలో సహా వాహనంలోకి ఎక్కేలా ఒక ర్యాంప్ లాంటిది ఉంటుంది. మోకాళ్ళ నొప్పులున్నా పెద్దవాళ్ళు బయటకి వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. సాంకేతిక సాయంతో దివ్యాంగుల కోసం రూపొందించిన క్యాబ్స్ ఇవి. వీటిని సక్రమంగా నిర్మించటం కోసం ప్రయాణికులను మానవత్వం తో పాటు అర్ధం చేసుకునే దిశగా డ్రైవర్లకు ట్రైనింగ్ ఇవ్వటంతో సహా విద్యా రామ శుభన్ ఎంతో కృషి చేసారు. బిట్స్ పిలానీ లో చదువుకున్న శ్రీ క్రిష్ కూడా ఈ క్యాబ్ నిర్వహణకు చాలా సాయపడతారు. రెండు గంటల ప్రయాణానికి 800 రూపాయలు వసూలు చేసే ఈ క్యాబ్స్ ఇప్పుడు బెంగుళూరు లో పనిచేస్తున్నాయి. త్వరలో చెన్నయ్ హైద్రాబాద్ కు కూడా ఈ క్యాబ్ సేవలు తీసుకొస్తామంటున్నారు విద్యా రామ శుభన్.
Categories
WoW

దివ్యాంగుల కోసం క్యాబ్ సేవలు

Leave a comment