ప్రతిరోజు నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండే ఆకు కూరలు బీట్ రూట్ ని తింటే హృద్రోగ సమస్యలు తగ్గుతాయని ఎడిత్‌ కోవన్‌ విశ్వవిద్యాలయం నిపుణులు చెబుతున్నారు. నైట్రేట్ ఎక్కువగా ఉండే ఆకు కూరలు తీసుకునే వాళ్లలో సిస్టోలిక్ బిపి తక్కువగా ఉంటుందని, వాళ్లలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా తక్కువే అంటారు పరిశోధకులు. వీటిని జ్యూస్ లాగా తీసుకోవటం కన్నా ఉడికించి తింటే మంచి ఫలితం ఉంటుందని కండరాలకు మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.

Leave a comment