కరోనా ఇన్ ఫెక్షన్ తో ప్రతి ఒక్కరిలో కనిపించే ప్రధాన లక్షణం జ్వరం. ఈ లక్షణం బయటపడితే అపుటికే మన శరీరంలో వైరస్ చేరి వారం రోజులు అయిందని గ్రహించాలి. జ్వరం ఉన్న సమయంలో వైరస్ లోడ్ విపరీతంగా ఉంటుంది. జ్వరం మొదలయ్యాక శరీరం వ్యాధుల పోరాటం మొదలు పెడుతోంది. వ్యాధినిరోధక శక్తి తో శరీరం స్పందించే తీరుతోనే ఎర్లీ పల్మనరీ దశకు చేరుకుంటాం. ఇలాటప్పుడు వైరస్ పరిమాణం తగ్గిన,ఆరోగ్యానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కనుక జ్వరం వచ్చిన వెంటనే అప్రమత్తం కావాలి. అంచేత జ్వరం వస్తే ఏ కారణంగా వచ్చిన అది కోవిడ్ జ్వరం గానే భావించి వైద్యులను సంప్రదించి కరోనా చికిత్స మొదలు పెట్టండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment