డీప్ ఫ్రిజ్ లో ఐస్ పేరుకుపోతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ చాలా తక్కువ సార్లు తెరవాలి ఫ్రిజ్ తెరిచినప్పుడు లోపల చల్లని గాలి బయటకు పోయి బయట గాలి లోపల ప్రవేశిస్తుంది ఈ వేడిగాలిలో ఉండే తేమ ఫ్రిజ్ లో ఐస్ గడ్డ కట్టేందుకు కారణం అవుతుంది. అలాగే వేడిగా ఉన్న పదార్ధాలు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత 18 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి ఫ్రిడ్జ్ లో ఎక్కువ ఖాళీ ఉండకూడదు పదార్థాలతో కూడిన బాస్కెట్లు నిండుగా సర్ది ఉంచుకుంటే ఐస్ తయారవకుండా ఉంటుంది. ఖాళీ ప్రదేశం ఉంటేనే ఐస్ తయారవుతుంది.

Leave a comment