ఫ్రిజ్లో ఘాటు వాసనలు వస్తూ ఉంటే ఒక చిన్న టిప్ ఉపయోగపడుతుంది. ఎండబెట్టిన నారింజ బత్తాయి కమలా నిమ్మ పండ్ల తొక్కుల పొడి ఒక స్పూన్ తీసుకుని అందులో ఉప్పు కలిపి ఓ చిన్న గిన్నెలో వేసి ఫ్రిజ్ లో ఉంచితే ఈ మిశ్రమం  ఆ వాసనలు  అన్నింటినీ పీల్చుకుంటుంది. అలాగే చెత్త బుట్ట లో కూడా నాలుగైదు ఎండిన నిమ్మ నారింజ తొక్కలు వేస్తే చెత్త తొలిగించేప్పుడు వాసన రాదు లెమూనెన్ అనే రసాయనానికి ఈ గల్లీ దోమల్ని దూరం చేసే శక్తి ఉంటుంది. సాధారణంగా నిమ్మజాతి పొలాల్లో ఈ రసాయనం ఉంటుంది. నిమ్మ నారింజ  తొక్కల్ని నీళ్లలో వేసి మరిగించి ఓ స్పూన్ లవంగం పొడి కలిపి ఇంటి మూలల్లో స్ప్రే చేస్తే దోమలు ఈగలు రావు.

Leave a comment