పనిలేకుండా నిరుపయోగంగా గడపటం నాకు నచ్చదు నాకు వయసు ఒక నంబర్ మాత్రమే. పని చెయ్యాలనే సంకల్పం ఉంటే వయస్సు ఒక లెక్క కాదు అంటుంది యామినీ మజుందార్. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ తల్లి 58 ఏళ్ళ వయసులో ఆమె జీన్స్ డ్రై క్లీనింగ్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించారు. 1990లో ఈ లాండ్రీ బిజినెస్ కోసం విదేశాల నుంచి హై ఎండ్ ఎక్విప్ మెంట్ ను దిగుమతి చేసుకున్నారు ఇప్పుడామెకు ఎనభై ఏళ్ళు రోజుకు నాలుగు గంటలు లాండ్రీ లోనే ఉంటుందామె. ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్ వస్తుంటే టివి ముందు నుంచి కదలదు మా అమ్మ గంటగంటకు ఆమె నాకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది అంటుంది కిరణ్ మజుందార్ తన తల్లి గురించి చెబుతూ నిజానికి మనసుకి వయసుతో పనేముంటుంది.