మనకి 20 మంది స్నేహితులంటే 19 మంది మనల్ని కలిసినప్పుడు తప్పనిసరిగా మాటల్లో  వచ్చే విషయం డైట్. బరువు తగ్గటం కొన్నాళ్ల పాటు తగ్గాను ఇప్పుడేం చేసినా ఇక తగ్గటం లేదంటూ వుంటారు. డాక్టర్ ఎంత తగ్గించినా బరువు తగ్గటం లేదంటే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి . థైరాయిడ్ ఫంక్షన్ విటమిన్ మినరల్ తో పాటు ఉన్నాయేమో చూడాలి . క్రమశిక్షణా పూరితమైన డైట్ నిరంతర వ్యాయామం జీవన శైలి గమనించుకోవాలి . శరీరం డైట్ విషయంలో వ్యాయామాల విషయంలో రొటీన్ గా అయిపోతుంది . అన్నీ మార్చాలి . అలాగే పోషకాలు తగ్గించేస్తే దీర్ఘ కాలంలో దాని ప్రభావం శరీరం పైన చూపెడుతుంది. మంచి బ్రేక్ ఫాస్ట్  తేలిగ్గా లంచ్ ఓ మోస్తరు గా  డిన్నర్ మధ్యలో చాలా తక్కువ పరిమాణంలో స్నాక్స్ తినాలి. ఒకేసారి పొట్ట నిండుగా కాదు మంచి నీళ్లు బాగా తాగాలి. ఎర్లీ మార్నింగ్ వ్యాయామాలు నడక అస్సలు మానరాదు. ఆ సమయంలో శరీరం రెస్ట్ లో ఉంది మెటబాలిక్ రేట్ శక్తి  స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు వర్కవుట్లు మానకూడదు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి కొత్తవీ  జీవన శైలిలోకి తీసుకు రాకూడదు.

Leave a comment