తీసుకొనే ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటే శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు డైటీషియన్లు . డైట్ లో ఐరన్ నిండిన పదర్దాలు చేర్చుకోమంటున్నారు . బీట్ రూట్ పెద్దగా రుచి గా లేకపోయినా ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . ఎర్ర కణాల నిర్మాణం లో సాయపడుతుంది అలాగే పాలకూర ఐరన్ కు నుంచి పోషక పదార్ధం . ఇందులో కాల్షియం సోడియం ఉంటాయి . ఇది తింటే హిమోగ్లోబిన్ లోపం కూడా తగ్గిపోతుంది . తొందరగా అలసి పోతున్నట్లు ఉంటే డైలీ గ్లాసు దానిమ్మ జ్యూస్ తో ఎనర్జీ లభిస్తుంది . జామ పండులు ,పచ్చని కూరగాయలు,గోధుమలు,రెడ్ మీట్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది .

Leave a comment