పెరిగే వయసు సహజసిద్ధంగా నెమ్మదించేలా చేయవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర సహజసిద్ధమైన కొలాజెన్ ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గేలా చేస్తుంది తీపిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి గోధుమలు ఇతర స్టార్ట్ ఉత్పత్తులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కనుక బ్రెడ్ పాస్తా లను తగ్గించుకోవాలి. చర్మం సాగే గుణాన్ని సంతరించుకొని మెరుస్తూ ఉండాలంటే రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలి. ఒత్తిడి కి లోనైతే కార్టిసాల్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ చర్మపు మెరుపులకు తోడ్పడే విలువైన ఖనిజ లవణాల పోషణకు అడ్డుపడుతుంది గనుక ఒత్తిడి తగ్గించుకోవాలి. శరీరానికి సరిపోను యాంటీ ఆక్సిడెంట్లు అందేలా తాజా పండ్లు కూరగాయలు తినాలి.

Leave a comment