ఇంట్లో బెడ్ రూమ్ చిన్నదిగా ఉంటే దానికి పెద్దగా కనిపించే లుక్ ఇవ్వటం పెద్ద కష్టం కాదు అంటారు ఇంటీరియర్ డెకరేటర్స్ . బెడ్ ని మధ్యలో కాకుండా కిటికీ దగ్గరగా జరుపుకొంటే చుట్టూ ఉన్న స్థలం ఉపయోగించుకొనే వీలుంటుంది . ఉదయపు వెలుతురు కూడా బెడ్ పైన పడుతుంది . చిన్న గదిలో గోడపై అద్దం ఉంటె చూసేవారికి గాడి రెండింతలుగా కనిపిస్తుంది . అవసరమైన ఫర్నిచర్ తీసేయాలి . అలాగే అందులో సామాను చాలా తక్కువగా ఉండాలి . మాస్టర్ బెడ్ కింద ఓ ఫుల్ ఓవర్ బెడ్ చేయించి పెట్టచ్చు దాన్ని డ్రాయర్ లాగా లాగితే దానిపై పిల్లలు పడుకోవచ్చు . అలాగే పెయింటింగ్ సక్రమ పద్దతిలో ఎంపిక చేస్తే గది  లో కాంతి పెరుగుతుంది . తెలుపు రంగు మరింత ప్రకాశవంతంగా  విశాలంగా చేస్తుంది.

Leave a comment