గోరింటాకు ఎర్రగా పండాలంటే ఆకుని రుబ్బేటప్పుడు కాస్త చక్కెర రెండు లవంగాలు అందులో వేయాలి బాగా మెత్తగా అయ్యాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ ని కలిపి ఓ అరగంట అలాగే ఉంచి అప్పుడు ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.చేతులకు పెట్టిన గోరింటాకు ఎండిపోయాక చక్కెర నిమ్మరసం కలిపి సిరప్ లో దూదిని ముంచి ఆ ఎండిన దానిపైన అద్దాలి. పెనం పైన ఇంగువ వేడి చేసి ఆ పొగ చేతులకు తగలనివ్వాలి అలాగే ఎండిన ఆకు కడిగేసుకుని చేతులకు లవంగా నూనెను రాసుకుంటే చక్కని రంగు కనిపిస్తుంది. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా గా చూస్తుంది.ఈ ఆషాడ మాసం లో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకుంటారు.

Leave a comment