బీట్ రూట్ జ్యూస్ తో ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు డాక్టర్లు. టీనేజ్ పిల్లలకు రక్తహీనత సమస్య దూరం అవుతోంది.హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. నీరసం తో బాధపడేవారికి తక్షణ శక్తి వస్తుంది.ఈ రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. నెలసరి సమయంలో బాధించే మూడ్ స్వింగ్స్ తగ్గిపోతాయి.కాలేయాన్ని శుద్ధిచేసి ఎముకల బలాన్ని పెంచుతుంది.తీయని రుచితో బీట్ రూట్ జ్యూస్ తాగాలనుకుంటే ఒక బీట్ రూట్ దుంప, ఆపిల్, అల్లం కలిపి జ్యూస్ తయారు చేసుకోవచ్చు.పైనాపిల్ రసం కలిపిన బీట్రూట్ జ్యూస్ కూడా రుచిగా ఉంటుంది.

Leave a comment