ఈ ప్రపంచం అంతా మేల్ డామినేషన్ తోనే నడుస్తుంది. ఇందుకు తెలుగు సినిమా మినహయింపు ఏమీ కాదు. సినిమా లన్ని మేల్ సెంట్రిక్ మీదే నడుస్తాయని, కధానాయిక ప్రాధాన్యం వున్న సినిమాలు ఇక్కడ రావని చాలా మంది అనడం, ఇది వున్న మాటే అంటోంది కధానాయిక రాకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఐఫా ఉత్సవంలో గ్రీన్ కార్పెట్ పైన నల్ల గౌనుతో క్యాట్ వాక్ చేసి ఈ అమ్మాయి, సినిమా రంగమనే ప్రపంచంలో ఏ రంగం తీసుకున్న నూటికి నూరు శాతం పురుషాధిక్యతే సినిమా అన్నది ఎంటర్ టైన్మెంట్ కాబట్టి, జనం ఫోకస్ అంతా సినిమాల పైన హీరో పాత్రల పైన వుంటుంది. కధానాయిక ప్రాధాన్యత తక్కువే. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ కధలోస్తే నాలాంటి వాళ్ళం ఎంతో మంది సిద్ధంగా వున్నాం. ఎప్పటికైనా ఈ విధానం మారుతుందని అనుకుంటున్నా. అలంటి రోజులొస్తే బావుండు అంటోంది రాకుల్.

Leave a comment