ఏ ఆందోళనకైనా నిద్రే మంచి మందు . ఈ కరోనా భయంతో మనుష్యులు దినచర్య మారిపోయింది. కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసి వస్తోంది. ఇళ్ళల్లోనే పిల్లలున్నారు. వాళ్ళ చదువులు,వాళ్ళ కట్టడి,ఇంట్లో పెరిగిన పనితో స్త్రీలలో ఆందోళన పెంచుతోంది. ఇలాటి సమయంలో అలవాటైన పద్ధతిని ఎప్పుడు వదలకండి. అనవసరంగా మధ్యాహ్నం నిద్ర పోవటం,వ్యాయామం మానేయటం,తోచక ఎదో ఒకటి తినటం ఇలాటి అలవాట్లు చేసుకోవద్దు.ఎప్పటిలాగే ఆఫిస్ కు వెళ్లుతున్నట్లే అన్ని పనులు ముగించాలి. గతం లో ఎలాటి దినచర్య వుంటుందో అదే కంటిన్యుచేయాలి. ఎప్పటి లగే అదే వేళకు నిద్రపోవాలి. లేకపోతే నిద్ర వేళకు భంగం కలిగి లేనిపోని ఆందోళన కలుగుతోంది. నిద్ర సరిగా లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది జాగ్రత్త.

Leave a comment