వ్యాయామం విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉండమని ఏదైనా అతిగా చేయద్దుని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధికులు. వ్యాయామం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదీదీ ,దాని ప్రభావం మెదడుపైన ఉంటుందంటున్నారు. అలసట పెరిగితే అది ఆలోచనల పైనా ప్రతిఫలిస్తుందని, ఫలితంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోలేదనీ అంటున్నారు కొంతమంది  అథ్లేటిక్స్‌ ను ఎంపిక చేసి ,అప్పటి వరకు  రెగ్యూలర్ గా చేస్తున్న వ్యాయామం కాకుండా కొన్ని వారాల పాటు అదనంగా సైక్లింగ్ రన్నింగ్ వంటివి చేయించారు. వాళ్ళ ఎమ్మారై స్కాన్ మెదడులో కొంత భాగం చురుకుదనం తగ్గినట్లు తెలిసింది మితిమీరి వ్యాయామం చేసిన సమయంలో మెదడు అలసటకు గురై సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయిందనీ ఇతరత్రా ప్రవర్తన లోపాలు తలెత్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Leave a comment