ఈ వర్షపు గాలులకు చర్మం పొడిబారిపోతుంది. రోజుకు రెండు సార్లు ముఖం శుభ్రం చేసుకుంటే చర్మం పై పేరుకోన్న దుమ్ము ధూళి పోతుంది చర్మం తేమను పోకుండా రెండు గంటల కోసారి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.దానితో పాటు సన్ స్క్రీన్  కూడా వాడుకోవాలి.  దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగాలి ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఇంట్లో  తయారు చేసుకునే ప్యాక్ వేసుకోవాలి. బొప్పాయి గుజ్జు, బాదం గింజల పొడి, పచ్చిపాలు, శనగపిండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి. చల్లని నీళ్ళతో ముఖం క్లీన్ చేసుకోవాలి ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే ముఖం రెండింతలవుతోంది.

Leave a comment