ఐ సి ఎం ఆర్ లో సీనియర్ సైంటిస్ట్ గా పని చేశారు డాక్టర్ నివేదిత గుప్తా . మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా పరీక్షలు చికిత్సలకు సంబంధించిన ప్రొటొకాల్స్ చూడటం,ఆమె బాధ్యత. న్యూఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజిలోఎం బి బి ఎస్ చేసిన డాక్టర్ నివేదిత. కరోనా వైరస్ కేసుల కోసం దేశవ్యాప్తంగా 130 ప్రభుత్వ లాబరేటరీలను ,52 ప్రైవేట్ లాబ్స్ ను,సిద్ధం చేశారు మాలిక్యులర్ మెడిసిన్ లో ఫై హెచ్ డీ చేసిన నివేదిత ఐ సి ఎం ఆర్ లో వైరస్ పరిశోధనల కోసం ల్యాబరేటరీ నెట్ వర్క్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ నెట్ వర్క్ కు సంబంధించిన 106 లేబరేటరీలు దేశ వ్యాప్తంగా వెలుగు చూసే పలు వైరస్ లు కనిపెడుతూ మన దేశానికి బాసటగా నిలుస్తున్నాయి.

Leave a comment