డాక్టర్ పూజ భాటియా మల్హోత్ర  నెఫ్రాలజిస్ట్ మూత్రపిండాల చికిత్స నిపుణురాలు హర్యానా లోని రోహోతాక్ నుంచి వెళ్లి యు.స్.లో స్థిరపడ్డారు పేషంట్లను చూస్తున్న క్రమంలో డాక్టర్ పూజ కు కోవిడ్ సంక్రమించింది కోలుకున్న వెంటనే మళ్లీ వీధుల్లోకి వచ్చారు పూజ ప్లాస్మా చికిత్స కోసం తన రక్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు కరోనా బాధితుల కోసం ఆమె చేస్తున్న నిస్వార్థ సేవ మాటల్లో చెప్పలేనిది కరోనా కొమ్ములు వంచుతున్న డాక్టర్ల పై తీస్తున్న డాక్యుమెంటరీ చిత్రం ఎ పాండమిక్, అవే ఫ్రమ్ ది మదర్ల్యాండ్ లో డాక్టర్ గా నటిస్తున్నారు పూజ.

Leave a comment