ప్రపంచం నలుమూలలా నమ్మకాలు కనిపిస్తూనే ఉంటాయి. హాంకాంగ్ లో ఎత్తైన భవనాల మధ్య పెద్ద కిటికీలు చూసి ఇంత ఖాళీలు ఎందుకు వదిలేశారు అన్న అనుమానం వస్తుంది.వీటిని డ్రాగన్ గేట్స్ అంటారు. మన దేశంలో ఇల్లు కట్టెప్పుడు అనుసరించే వాస్తు శాస్త్రం లాగా చైనీస్ ఫెంగ్ ఘాయి అన్న వాస్తును అనుసరిస్తారు డ్రాగన్లు వాటి నివాసాలకు వెళ్లేందుకు ఈ పెద్ద భవనాలు అడ్డురాకుండా మధ్యలో ఇలా ఖాళీలు వదిలేస్తారు ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని వాళ్లకు నమ్మకం.

Leave a comment