వేసవి వేడిమిని తట్టుకొని సన్ బర్న్  నుంచి చర్మ రక్షణ ఇవ్వటంలో ద్రాక్ష  ఎంతగానో తోడ్పడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి  రక్షణ కలిపించి స్కిన్ డామేజ్ ని అడ్డుకొనే పాలిఫినాల్స్ అనే సహజసిద్ధమైన గుణాలు ద్రాక్షలో ఉన్నాయని కాబట్టి వేసవి లో ద్రాక్ష తినటం ఎంతో అవసరమని తాజా అధ్యయనం రిపోర్ట్. అంతేకాదు చర్మానికి పై పూతగా ద్రాక్ష రసాన్ని పట్టిస్తే ఎండ నుంచి అదనపు రక్షణ దక్కుతుందని అధ్యయనం  చెపుతోంది .చర్మాన్ని సంరక్షించేందుకు చక్కటి ఆహారం ఎంతగానో ఉపయోగ పడుతోందని అలాంటి ఆహారంలో ద్రాక్షను తప్పనిసరిగా చేర్చమని చెపుతున్నారు  పరిశోధకులు.

Leave a comment