ప్రొ రెనెటా ఇదొక ప్రాజెక్ట్ పేరు. ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా పాఠశాల స్థాయిలో చేపట్టిన ఈ పరిశోధనకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నిధులు సమకూర్చటం ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యానికి నిదర్శనం. ఆలియా మహమ్మద్ అనే టెన్త్ క్లాస్ విద్యార్దిని డ్రగ్స్ తీసుకునే వారిని కనిపెట్టేందుకు ఒక ఫార్ములా కనిపెట్టింది. ఇదే సైబర్ క్లిప్. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ కు అనుసంధానం చేస్తే డ్రగ్స్ జాడ పట్టేస్తుంది. మాదక ద్రవ్యాలు తీసుకునే పిల్లల జాడ పసిగడుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఆలియాతో పాటు సారా వర్గీస్, అంచల్ రఘువంశీ, దండబోయిన దీపిక ఉన్నారు. వీరంతా భారతీయ మూలాలు ఉన్నవారే. అసిఫ్ మొహమ్మద్, సమ్రినా ఆలియా తల్లిదండ్రులు. వీరు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ లో ఉంటారు. ఆలియా తాత అన్వర్ నివాసం విజయవాడ. భారత మూలాలున్న ఆలియా ఒక సైబర్ డివైస్ ను కనుగొనటం గర్వించదగ్గ విషయం

Leave a comment