Categories
దృష్టి సంబంధిత సమస్యలు ఉంటే కంటి దృష్టి బావున్న వారితో పోల్చితే అల్జీమర్స్ వచ్చే అవకాశం 63శాతం ఎక్కువేనని అధ్యయనాలు చెపుతున్నాయి. దృష్టి సరిగా లేని కారణంగా ఎక్సర్ సైజ్ చేయటం ,చదువుకోవటం ,సోషలైజింగ్ వంటి బ్రెయిన్ బూస్టింగ్ అలవాట్లు తక్కువగా ఉంటాయని బయటి మనుషులతో సంబంధాలు తక్కువగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి క్రమంగా నశించి పోతూ ఉంటుందని అధ్యయనకారులు తేల్చారు. అందుకే కంటి సమస్యలు ఉన్నవాళ్లు వెంటనే వాటిని సవరించుకుని కరెక్టెల్ లేదా కళ్ళ జోడులు వాడితే అల్జీమర్స్ వ్యాధి సోకే అవకాశాలు తగ్గించుకోవచ్చు అంటారు. ఎక్కువ చదవటం వంటివే మెదడును చైతన్యవంతగా ఉంచుతాయని చెపుతున్నారు.